బాలకృష్ణ అందుకే అలిగాడా ?
కరోనా లాక్‌డౌన్ వల్ల నిలిచిపోయిన సినిమా షూటింగ్స్ తిరిగి మొదలు కాకముందే… గొడవలు మొదలయ్యాయి. హీరో బాలకృష్ణ చేసిన వాఖ్యలు ఇప్పడు సినిమా ఇండస్ర్టీలో పెద్ద దూమారం లేపాయి. తెలంగాణలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సినిమా ప్రముఖులతో జరుపుతున్న సమావేశానికి నన్ను పిలవలేదని, వార్త పత్రికలు, టీవీల ద్వారా ఆ విషయాన్ని తెలుసుకున్నానని ఆయన అన్నారు. తనని ఈ సమావేశానికి ఎందుకు పిలవలేదు అనే విషయం తనకు తెలియదన్నారు.
దీంతో రెండు వర్గాలుగా చీలినట్లు అయ్యింది సినిమా రంగం. చిరంజీవి తమ్ముడు నాగాబాబు బాలకృష్ణ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. కాగా మంత్రి త్వరలో సినిమా షూటింగ్‌లకు అనుమతులు ఇచ్చే అవకాశం ఉందన్నారు. మరో వైపు మోగాస్టార్, బాలయ్య రెండు వర్గాలుగా దర్శకులు, నిర్మాతలు ఎవరికి వారు ఈ అంశంపై మాట్లాడుతుడటం ఇప్పటిలో సమిసిపోయోలా కనిపించడం లేదు.