కుర్రాడిలా మారిపోయిన హీరో మ‌హేష్‌బాబు

డెక్క‌న్ న్యూస్‌, సినిమా ప్ర‌తినిధి న‌రేష్ :
తెలుగు సినిమా రంగంలో ఆయ‌న‌కి ఉన్నంత‌ క్రేజ్ మ‌రేవ‌రికి లేదు అనే చెప్పుకోవాలి. అమ్మాయిల ద‌గ్గ‌ర నుంచి అబ్బాయిల వ‌ర‌కు అబ్బా…. మ‌హేష్‌బాబు అనేలా ఉంటాడు. అంతే కాదు… అత‌ను కూడా అభిమానుల‌కు అంతే ద‌గ్గ‌ర ఉంటూ… లాక్‌డౌన్‌ కాలంలో సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటోన్న విషయం తెలిసిందే. మహేశ్‌ హోంక్వారంటైన్‌ సమయాన్ని తన కుటుంబంతో కలిసి ఎంజాయ్‌చేస్తున్నాడు. అయితే మహేశ్‌ సెల్ఫీ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తన కూతురు, కొడుకుతో కలిసి ఓ సెల్ఫీ దిగాడు. ఈ సెల్ఫీ ప్రత్యేకత ఏంటంటే మహేశ్‌ యంగ్‌ లుక్‌లో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.