ఖిల్లా ఘనపురంలో కలిసి పొరాడుతాం
ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనాని తమ గ్రామానికి రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని సర్పంచ్ కె.వెంకటరమణ అన్నారు. గ్రామంలో జరుగుతున్న అన్ని రకాల ప్రభుత్వ పనులు, ప్రజలు తమ స్వంత పనులకు వెళ్లినప్పుడూ కూడా భౌతిక దూరం పాటిస్తూ… మాస్క్‌లు ధరిస్తూ ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారని తెలిపారు. అలాగే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకున్నామని వెల్లడించారు సర్పంచ్. కరోనా సోకిన వారు త్వరగా కోలుకొవాలని ఆయన అన్నారు.