నిరాడంబరంగా రాష్ట్ర అవ‌త‌ర‌ణ వేడుక‌లు :‌ సీఎం

లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్రావతరణ వేడుకలను ఈ సారి నిరాడంబరంగా జరపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ అమర వీరులకు నివాళులు అర్పించడం, అనంతరం జాతీయ పతాకావిష్కరణ జరపడం మాత్రమే నిర్వహించాలన్నారు. ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించవద్దని చెప్పారు.

  • మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తమ తమ కార్యాలయాల్లోనే జాతీయ పతాకావిష్కరణ జరుపుతారు
  • ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా అమరవీరుల స్థూపానికి నివాళి అర్పించి, అనంతరం ప్రగతి భవన్ లో పతాకావిష్కరణ చేస్తారు.
  • అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా ముందుగా అమరవీరులకు నివాళి అర్పించి, అనంతరం పతాకావిష్కరణ చేస్తారు. జిల్లా కేంద్రంలో ముఖ్యమైన అధికారులతో చిన్నపాటి ఎట్ హోమ్ నిర్వహిస్తారు.