చందాయిపేటలో దారుణ హత్య
చేగుంట మండలం చందాయిపేట జరిగిన హత్య కలకలం రేపింది. ప్రశాతంగా ఉన్న ఊరిలో భయం భయం గుప్పిట్లోకి వెళ్లింది. ఊర్లో ఎవరిని కదిలించిన హత్య గురించే మాట్లాడుతున్నారు. హత్య జరిగిన సంఘటన మంగళవారం ఉదయం వెలుగుచూసింది. గ్రామాస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన చిట్టబోయిన సురేష్ (35)కి అదే గ్రామానికి చెందిన తలారి రాములకు మధ్య గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి.
మూడు రోజుల క్రితం సురేష్ , రాములు గొడవ పడ్డారు. ఇదే విషయంపై పోలీస్ స్టేషన్ సైతం వెళ్లారు. సోమవారం ఇంటి నుంచి వెళ్లిన సురేష్ మంగళవారం ఊరి చెరువులోని ఇసుక వద్ద శవమై తేలాడు. తలపై , ఇతర చోట్ల బండరాయితో కొట్టినట్లు గాయాలు అయ్యాయి. పక్కన మద్యం సీసాలు ఉండడంతో మద్యం తాగించి హత్య చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు రాములు సురేష్‌ని చంపేస్తా అని బెదిరించారని సురేస్ అన్న రమేష్ తెలిపారు. సోమవారం అల చెప్పిన తరువాత తన తమ్ముడు హత్యకు గురయ్యాడని పోలీసుల ఏదుట ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త హత్యకు తలారి రాములు, స్వామి, నరేందర్‌లు కారణమని మృతుడి భార్య పద్మ తెలిపింది. అయితే సురేష్‌పై గతంలో పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు పోలీసులు.