స్టాఫ్ నర్స్ పై గ్యాంగ్ రేప్

రంగారెడ్డి జిల్లా లో దారుణం చోటు చేసుకుంది. ఓ స్టాఫ్ నర్స్ పై దుండ‌గులు గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. వివ‌రాల్లోకి వెళ్తే ప్రియుడు భాను తన ఇద్దరు స్నేహితుల తో కలసి సామూహిక అత్యాచారం చేశాడు. నీతో ఒంటరిగా కలవాలి అంటూ బాధితురాలికి ఫోన్ ప్రియుడు ఫోన్ చేశాడు. ఆ అమ్మాయి వ‌చ్చాక కూల్ డ్రింక్ లో మత్తు మందు కలపి ఇచ్చారు. ఎలికట్ట సమీపంలోని ఓ ఐరన్ పరిశ్రమ వెనుక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకొని వెళ్లిన ప్రియుడు. పలు మార్లు బాధితురాలి పై అత్యాచారం చేశాడు. అంతటి తో ఆగకుండా తన స్నేహితులను అక్కడికి పిలిపించిన దుర్మార్గుడు. తన స్నేహితుల కోరిక కూడా తీర్చాలంటూ ఒత్తిడి చేశాడు. దానికి ససేమీరా అనడంతో కూల్ డ్రింక్ లో మత్తు మందు కలపి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ కామాందులు. వారిని ప్రతిఘటించడానికి ప్రయత్నించడంతో ఆమె పై దాడికి పాల్పడ్డారు. భాదితురాలికి తీవ్రగాయాలు అయ్యాయి. వారి నుండి త‌ప్పించుకొని జరిగిన విషయాన్ని కుంటుంబ సభ్యులకు తెలిపిన బాధితురాలు. షాద్‌నగర్ పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితురాల బందువుల డిమాండ్ చేస్తున్నారు.