అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థి మృతి
ఎల్బీనగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అనుమానాస్పద స్థితిలో వైద్య విద్యార్థి మృతి చెందండంతో అక్కడ కలంకలం రేగింది. వివరాల్లోకి వెళ్తే… ఎల్‌బి నగర్‌లోని సాగర్ రింగ్ రోడ్ లోని అలేఖ్య టవర్స్ లో 14 వ అంతస్తు లో నివసిస్తున్న రఘురాం పద్మ కూతురు సాహితీ మృతి చెందింది. ఆమె ఉస్మానియా ప్రభుత్వ డెంటల్ కాలేజీలో (BDS) నాలుగో సంవత్సరం చదువుతున్న
చదువుతోంది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో తన నివాసంలోనే 14 వ అంతస్తు నుండి బాల్కనీలో ఉన్న గ్రిల్స్ తొలగించి పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. కాగా మృతికి గల పూర్తి వివరాలు తెలియరాలేదు. అయితే ప్రేమ వ్యవహారామా లేదా కళాశాలలో ఉపాధ్యాయుల వేధింపులే కారణామా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.