తెలంగాణలో 66 కొత్త కేసులు
రాష్ట్రంలో ఇవాళ కొత్తగా మరో 66 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 31, రంగారెడ్డి జిల్లాలో మరొకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అలాగే విదేశాల నుంచి వచ్చిన 18 మంది, 16 మంది వలస కార్మికులకు పాజిటివ్ గా తేలింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,920 చేరింది. కరోనా నుంచి ఈ రోజు కోలుకొని మరో 72 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటి వరకు 1164 మంది డిశ్చార్జి అయ్యారు. దవాఖానల్లో 700 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో ఈ రోజు ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 56కు పెరిగిందని రాష్ట వైద్య ఆరోగ్య తెలిపింది.