బస్తీ దవాఖానను ప్రారంభించిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 131 కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని ద్వారక నగర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదల చెంతకే వైద్య సదుపాయాలను అందించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా నేడు బస్తీ దవాఖానలు ప్రారంభించడం జరిగిందని, ఈ బస్తీ దవాఖానాలతో వేల మందికి స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో డిసి మంగతాయారు గారు, స్థానిక డివిజన్ అధ్యక్షులు కెఎం గౌరీష్ గారు తదితరులు పాల్గొన్నారు.