బస్తీ దవాఖాన ప్రారంభం

పట్టణ ప్రాంతంలో పేదలకు వైద్యాన్ని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం బస్తీ దవాఖాన లను ఏర్పాటు చేస్తుందని రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నగర శివారు రాజేంద్రనగర్ పరిధి బుద్వేల్ బస్తీ దవాఖానను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…..గ్రేటర్ పరిధిలో 300 బస్తీ దవాఖాన లను ఏర్పాటు చేయడం ప్రభుత్వ లక్ష్యమని అయితే ఇప్పటికే 123 దవాఖానాలను ప్రారంభించామని ఈరోజు 45 ప్రారంభించామని తెలిపారు. పేదల కు వైద్యం అందించడమే బస్తీ దవాఖానల ముఖ్య ఉద్ద్యేశ్యమని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు.