సీఎం ఇలాకాలో భారీ చోరీ

తెలంగాణ సీఎం కెసిఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో భారీ బంగారం చోరీ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… గజ్వేల్ పట్టణంలో ఓ బంగారు దుకాణంలో పనిచేస్తున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రామ్ సుఖ్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా అక్కడ పని చేస్తున్నాడు. యాజామాని కళ్ళుకప్పి ౩౦ తులాల బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. అయితే కరోనా లాక్ డౌన్ వల్ల చాలా రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కాబట్టే అతను ఈ చోరీ చేశాడని యజమాని భావిస్తున్నాడు. దీనితో యజమాని పట్టణంలోని పోలీసులకు పిర్యాదు చేశాడు. సీఎం సొంత నియోజకవర్గం కాబట్టి పోలీసులు కూడా ఈ చోరీని సవాలు తీసుకున్నారు. కాగా ఈ చోరీకి సంబందించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.