మంత్రి మల్లారెడ్డిని ముఖ్యమంతిగా చేసిన అల్లుడు
మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు ఎలా ముఖ్యమంత్రి అయ్యారో మీకు తెలుసా ? అసలు ఆయన్ని ముఖ్యమంత్రి చేసింది ఎవరో తెలుసా మీకు ? అసలు ఈ కథ ఏంటో తెల్వలి అంటే ఈ వార్త చదవాల్సిందే ..
కరోనా కష్టాలు సామాన్య ప్రజలకే కాదు మత్రులకు కూడా వచ్చాయి. ఆ కష్టంలో మంత్రి ఏకంగా ముఖ్యమంత్రి అయ్యారు. వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిని పొగడండంలో అయన అల్లుడు మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పోటీ చేసి ఓడిపోయినా మర్రి రాజశేఖర్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి తన మామని మంత్రి నుండి ముఖ్యమంత్రిని చేసారు. లాక్ డౌన్ వల్ల మేడ్చల్ జాతీయ రహదారిపై వలస కూలీలు పడుతున్న కష్టాలను చూసి తన మామ ఎంతో మందికి నిత్యం అల్పాహారం, భోజనం, రాత్రి భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నారు అని గౌరవ ముఖ్యమంత్రి మల్లారెడ్డి కి ధన్యవాదాలు అంటూ ఓ కార్యక్రమంలో మాట్లాడారు. దీనితో ఆ వీడియో చాల వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.