ఒకే సమయంలో 45 బస్తీ దవాఖానాల ప్రారంభం
ఈ నెల 22 న ఉదయం 10.30 గంటలకు GHMC పరిధిలో ఒకే సమయంలో 45 బస్తీ దవాఖానాల ప్రారంభం చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.
హైదరాబాద్ -22, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 15, రంగారెడ్డి జిల్లాలో 05, సంగారెడ్డి జిల్లాలో 03 బస్తీ దవాఖానాల ప్రారంభం కానున్నాయి
బస్తీ దవాఖానాలు ప్రారంభించనున్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, హోం మంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ప్రభుత్వ విప్ ప్రభాకర్, మేయర్ బొంతు రాంమోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసి యోద్దిన్, స్థానిక mla లు కర్పోరేటర్ల తో కలిసి ప్రారంభిస్తారు.
ప్రస్తుతం GHMC పరిధిలో 123 బస్తీ దవఖానాలు ప్రతిరోజూ 10 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నాయి. నూతనంగా ప్రారంభించే 45 బస్తీ దవాఖానాల తో అదనంగా 4 వేల మందికి వైద్య సేవలు అందుతాయి.
ఒక్కో బస్తీ దావఖాన లో ఒక వైద్యుడు, ఒక నర్స్, ఒక సహాయకుడు ఉంటారు. ప్రజలకు వైద్య సేవలు మరింత చేరువ చేసేందుకే ప్రభుత్వం బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేస్తుంది.