ఆ నేతలను కాపాడడానికేనా సీఎం ప్రయత్నం : కాట్రగడ్డ

విశాఖపట్నం ఎల్జిమర్ గ్యాస్ ఘటనలో వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది అని మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూనా మండిపడ్డారు.  ఒక వైపు కరోనా తో రాష్ట్రంలో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నా పటించుకోవడం లేదు అని విమర్శించారు. ఎల్జిమర్ గ్యాస్ కంపెనీలకు ఎలా అనుమతులు వచ్చాయి, వాటిలో గల వాటాదారులు, అధికారుల వివరాలపై శ్వేత పత్రం విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు. ఆ ఘటనలో మరణించిన వారికీ కోటి రూపాయలు ఇచ్చి విషయాన్ని పెద్దది కాకుండా చేశారని ఆరోపించారు. వారి పార్టీలకు చెందిన నేతలను  సీఎం జగన్ కాపాడుతున్నారు అని వ్యాఖ్యానించారు. గ్యాస్ లీకు భాదితులను ఆదుకోవాలని కోరారు.