ఆ హీరోతో క్వారంటైన్ లో ఉంటా అంటున్న పూజా హెగ్డే.
ఆ హీరోతో క్వారంటైన్ లో ఉంటా అంటున్న పూజా హెగ్డే. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ భామ చేతిలో ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ఉంది.అలాగే ఎన్టీఆర్ సినిమా కోసం పూజా హెగ్డేని తీసుకున్నారు అనే టాక్ ఉంది.అలాగే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తో ఒక సినిమాతో పాటు రెండు సినిమాలు లైన్ లో పెట్టింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు లేకపోవడంతో కుటుంబంతో క్వారంటైన్ టైంని స్పెండ్ చేస్తూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చట్లు చెప్పుకుంటూ హీరోయిన్స్ అందరూ కాలం గడిపేస్తున్నారు.ఈ నేపధ్యంలో తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తున్న సందర్భంగా పూజా హెగ్డేని మీరు క్వారంటైన్ టైం లో ఉన్నప్పుడు మీకిష్టమైన ఏ హీరోతో మీరు క్వారంటైన్ షేర్ చేసుకుంటారు అని ప్రశ్న వచ్చింది.దానికి ఆమె చాలా ఆసక్తికరమైన సమాధానం చెప్పింది.ఈ క్వారంటైన్ సమయంలో అందరి దగ్గరనుండి ఏదో ఒక విద్య నేర్చుకోవాలని ఉంది అంటుంది. అదే ఒకే ఒక్క హీరోతో క్వారంటైన్ షేర్ చేసుకోవాలి అంటే కచ్చితంగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌ని ఎంచుకుంటా, అతనితో కలిసి ఉండటానికి ఇష్టపడతా అని తెలిపింది.హృతిక్ రోషన్ చిన్నప్పటి నుండి నా కలల హీరో. నా అదృష్టం కొద్ది బాలీవుడ్‌లో నా ఫస్ట్ సినిమాని ఆయనతోనే కలిసి నటించా.హృతిక్ అనేక విషయాల్లో నాకు స్ఫూర్తిగా నిలుస్తుంటారు. స్వీయ నిర్బంధంలో రోజూ లేచిన తర్వాత హృతిక్ అందాన్ని చూస్తూ గడిపేస్తా.వర్కౌట్స్ చెయ్యడం, అటు ఆహారపు అలవాట్లలో, ఇటు డ్యాన్స్‌ల విషయాలలో హృతిక్ నుండి ఎంతో నేర్చుకుంటా అని పూజా చెబుతుంది. మొత్తానికి పూజా హెగ్డే తన అభిమాన హీరో దగ్గర లేకపోయినా అతని ఆలోచనలతోనే ప్రతిరోజు గడుపుతుందని ఆమె మాటల బట్టి అర్ధమవుతుంది.