మనల్ని మనమే కాపాడుకుందాం : ఎమ్మెల్యే రోజా

కరోనా సమయంలో మనల్ని మనమే కాపాడుకోవాలి అని నగరి ఎమ్మెల్యే రోజా కోరారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వం ప్రభుత్వం సూచించిన సూచనలు తప్పకుండ పాటించాలని అన్నారు. నగరి మండల పరిధిలోని 17 గ్రామ పంచాయతీలలోని ప్రజలకు ప్రతి ఒక్కరికి 3 మస్క్ ల చొప్పున 80 వేల మస్క్ లను మండల పరిషత్ అభివృద్ధి అధికారి ద్వారా పంపిణి చేశారు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అరుహులైన 5 మందికి 5,70,0000 రూపాయల చెక్కును అందజేశారు. మరోవైపు నిండ్ర మండలం ఆరూరు గ్రామంలో జరుగుతున్న గ్రామ సచివాలయ పనులను కూడా పరిశీలించారు.