సమంత ఎవరితో బైక్ రైడ్ కి వెళ్లిందో తెలుసా మీకు ?

సమంత పరిచయం లేని పేరు. తన నటన, అందంతో తెలుసు, తమిళ , మళియాల ప్రేక్షకులను కట్టి పడేసింది. సినిమాల చలాకీగా ఉండే సామ్ బయట కూడా అలాగే ఉంటుంది. ఎప్పుడు అభిమానులకు దగ్గరగా ఉంటూ తన నిత్య జీవిత విశేషాలను పంచుకుంటుంది. సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే స‌మంత త‌ర‌చు త‌మ ఫోటోల‌ని షేర్ చేస్తూ అల‌రిస్తూ ఉంటుంది. ఈ మ‌ధ్య కొద్ది రోజులు సోష‌ల్ మీడియాకి దూరంగా ఉన్న స‌మంత తిరిగి పోస్ట్‌లు పెడుతుంది. ఇటీవ‌ల త‌న భ‌ర్త‌తో పాటు పెట్ డాగ్‌తో క‌లిసి కారులో దిగిన పిక్‌ని షేర్ చేసిన సామ్ తాజాగా తన భర్త, హీరో నాగచైతన్యతో పిలియన్‌ బైక్‌పై కూర్చొని దిగిన ఫోటోని షేర్ చేసింది. ఇందులో చైతూ హెల్మెట్ ధ‌రించ‌గా స‌మంత వెనుక బ్యాగ్ వేసుకొని చేతిలో హెల్మెట్ ప‌ట్టుకొని ఉంది. నిత్యావ‌స‌ర స‌రుకుల కోసం వీరు బ‌య‌ట‌కి వెళ్లేందుకు సిద్ధ‌మైన‌ట్టు ఈ ఫోటోని బ‌ట్టి తెలుస్తుంది.