వాటిని పాటించండి : కాట్రగడ్డ

కరోనాని కట్టడి చేయాలి అంటే ప్రతి మనిషి తనలో తాను మారాలని అన్నారు మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన నియమాలు తప్పకుండ పాటించాలని పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది మరణిస్తున్నారని, వాటికీ అడ్డుకట్ట వేయాలి అంటే… భౌతిక దూరం పాటించాలని ఆన్నారు. గత కొన్ని రోజులుగా ఏపీలో విపరీతమైన కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం ప్రజలను భయాందోళనకు గురవుతున్నారు అని తెలిపారు. ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టి కట్టడి చేసే ప్రయత్నం చేయాలన్నారు. అలాగే ప్రజలు కూడా శుభ్రత పాటించాలని సూచించారు.