కరొనకు వణుకుతున్న తెలంగాణ

తెలంగాణలో కరోనా మహమ్మారి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ప్రతి రోజు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్ల ప్రభుత్వం ఆందోళనకు గురవుతుంది. ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా మరో 40 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో మెత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1454 కు చేరింది. కొత్తగా వచ్చిన కరోనా పాజిటివ్‌ కేసుల్లో 33 జీహెచ్‌ఎమ్‌సీలోనే నమోదయ్యాయి. మిగిలిన 7 కేసులు ఇతర రాష్ర్టాలు, ఇతర దేశాల నుండి రాష్ర్టానికి వచ్చిన వారిలో నమోదయ్యాయి. ఈ రోజు కరోనా పాజిటివ్‌ వచ్చి చికిత్స తీసుకుని తిరిగి కరోనా నెగెటివ్‌ వచ్చి డిశ్చార్జ్‌ అయిన వారు 13 మంది ఉన్నారు. దీంతో మొత్తం రాష్ట్రంలో ఉన్న యాక్టివ్‌ కేసుల సంఖ్య 461 గా ఉంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా నయం అయి డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్ళిన వారి సంఖ్య 959 మందిగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య మొత్తం 34 మంది.