కరోనా ఎప్పటికీ తగ్గదేమో..!
కరోనా వైరస్‌ను ప్రపంచం నుంచి మటుమాయం చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. చాలా దేశాలు లాక్‌డౌన్ నిబంధనలను సడలిస్తున్న నేపథ్యంలో ప్రజలు కరోనా వైరస్‌తో జీవించటం అలవాటు చేసుకోవాలని అంతర్జాతీయ సంస్థ సూచించింది. అంతేకాకుండా కొవిడ్-19ను సమూలంగా తుడిచిపెట్టడం ఇప్పట్లో సాధ్యం కాని పని అని సంస్థ వ్యాఖ్యానించింది.