ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా లింక్ రోడ్లు ఏర్పాటు: సి.హెచ్ మల్లా రెడ్డి

బోడుప్పల్ మరియు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు లింక్ రోడ్డు కోసం ఈరోజు స్థలాలను పరిశీలించడం జరిగింది.

పీర్జాదిగూడ,బోడుప్పల్ లో ట్రాఫిక్ ను మళ్లించేందుకు ఈ లింక్ రోడ్లను ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్ నగరం నుండి బయటికి మరియు బయట నుండి నగరానికి వచ్చి వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా లింక్ రోడ్లు ఏర్పాటు.

హైదరాబాద్ నగరం లో 54 మిస్సింగ్ లింక్ రోడ్లు ఏర్పాటు. లింక్ రోడ్ల ద్వారా మెయిన్ రోడ్డు లో ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది.

స్థానిక రైతుల భూమి మరియు ఇతర సమస్యల పరిష్కారం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం.పనులు ప్రారంభం అయినాయి. లాక్ డౌన్ పూర్తి అయ్యేలోపు లింక్ రోడ్డులు పూర్తి చేస్తాం. పర్వతపురం,బతుకమ్మకుంట,నల్లచెరువు,ద్వారకా నగర్ మీదుగా బోడుప్పల్ కు లింక్ రోడ్డు ఏర్పాటు. అన్నారు మంత్రి

ఈ కార్యక్రమం లో జి.హెచ్.యం.సి మేయర్ బొంతు రామ్మోహన్ గారు,మేయర్లు వెంకట్ రెడ్డి,బుచ్చి రెడ్డి గార్లు,హెచ్.ఆర్.డి.సి,హెచ్.ఎం.డి.ఏ,జి.హెచ్.యం.సి అధికారులు పాల్గొన్నారు.