కామంతో కన్న కూతురినే అత్యాచారం చేసిన తండ్రి
సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే దారుణానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొరెనా జిల్లాలో 18 ఏళ్ల బాలికను కన్న తండ్రే అత్యాచారం చేశాడు. లాక్‌డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటున్న కూతురుని మార్చి 26న అత్యాచారం చేశాడు. ఇంత ఘోరం జరుగుతుంటే కన్న తల్లి చూస్తూ నిలబడి తండ్రికే సహకరించినట్లు తెలిసింది. ఆ తర్వాత బాధితురాలు ఇంటి నుంచి తప్పించుకొని బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి బంధువుల ఇంటి నుంచి ఆమెను తీసుకెళ్లి, ఏప్రిల్ 10న మరోసారి అత్యాచారం చేశాడు. జరిగిన ఘోరాన్ని తెలుసుకున్న ఆ యువతి సోదరి పోలీసులకు సమాచారం అందించింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలి తల్లిదండ్రులను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు.