తెలంగాణలో పేలిన రియాక్టర్

విశాఖపట్నం ఎల్జిమర్ కంపేనీలో విష వాయువు ఘటన మరవకముందే తెలంగాణాలో ఒక ఘటన చోటు చేసుకుంది. జహీరాబాద్ మండలం అర్జున్ నాయక్ తాండలోని ఖాందా ఫ్యూయల్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలడంతో పలువురు మృతి చెందారు. ఈ సంఘటనలో మృతి చెందిన ఇరు కుటుంబాలకు 15 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించడానికి కంపెనీ యాజమాన్యం ఒప్పుకుంది. మృతుల కుటుంబాలకు పరిహారం అందేలా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చారు.