బండి సంజయ్‌పై కేసు నమోదు
కరోనా లాక్ డౌన్ నిబంధనలు పాటించలేదు అని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై కేసు నమోదు చేసారు పోలీసులు. మంగళవారం నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. అయితే లాక్‌డౌన్ నిబంధనల్లో భాగంగా ఉన్న భౌతిక దూరాన్ని పాటించలేదు. దీంతో పెద్దవూర పోలీసులు సంబయ్‌తో పాటు పలువురిపై 188 సెక్షన్ క్రింద కేసులు నమోదు చేశారు. కాగా, నిన్న నల్గొండ జిల్లాలోని పెద్దవూర మండలం ఊట్లపల్లిలో బత్తాయి రైతులను బండి సంజయ్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెట్టుబడి కూడా రాకపోవడంతో బత్తాయి రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వమే బత్తాయిలను కొనుగోలు చేయాలని కోరారు.
ప్రజల్లో బీజేపీ కి వస్తున్న ఆదరణ చూడలేక కావాలని ఇలాంటి కేసులు పెడుతున్నాయి అని బీజేపీ శ్రేణులు విమర్శించారు.