రైలు ప్రమాద ఘటనపై మోదీ దిగ్భ్రాంతి
మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆ ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ఔరంగాబాద్‌లోని కర్మాడ్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 16 మంది నిద్రలోనే మృత్యు ఒడికి చేరుకున్నారు. ‘మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగిన రైలు ప్రమాదం తీవ్ర ఆవేదన కలిగించింది. దీనిపై రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌తో మాట్లాడాను. ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తాం’ అని మోదీ ట్వీట్ చేశారు.