తెలంగాణలో కోర్టులకు లాక్‌డౌన్‌ పొడిగింపు….టీఎస్ హైకోర్టు

తెలంగాణలో కోర్టులకు లాక్‌డౌన్‌ పొడిగింపు….ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు..

రాష్ట్రంలో కోర్టులు, ట్రైబ్యునళ్ల లో లాక్‌డౌన్‌ను ఈ నెల 29 వరకు పొడిగించిన తెలంగాణ హైకోర్టు .రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఈ నెల 29 వరకు పొడిగిస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం..

జిల్లా, మేజిస్ట్రేట్ కోర్టులు, ట్రైబ్యునళ్లు, న్యాయ సేవాధికార సంస్థలు, జ్యుడీషియల్ అకాడమీలు పనిచేయవని తెలిపిన హైకోర్టు..

అత్యవసర కేసులను మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించనున్నట్లు స్పష్టం చేసిన హైకోర్టు..

హైకోర్టులో సైతం సాధారణ న్యాయ, పరిపాలనా పరమైన కార్యకలాపాలు ఈ నెల 29వరకు నిలిపివేస్తున్నట్లు తెలిపిన హైకోర్టు..