ఆయనతో నాకు ఎటువంటి సంబంధం లేదు : మిల్క్ బ్యూటీ
ప్రముఖ టెన్నిస్ట్ స్టార్ సానియా మీర్జా.. పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ని ప్రేమ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా తమన్నా, పాక్ బౌలర్ అబ్దుల్ రజాక్ వివాహం చేసుకోనున్నారని గత రెండు మూడు రోజులుగా పుకార్లు షికారు చేస్తున్నాయి. దీనిపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించిన తమన్నా ఫుల్ ఫైర్ అయింది. తప్పుడు వార్తలు రాసేవారిని ఎండగట్టింది.
పాక్ టీంకు దాదాపు 20 ఏళ్లు ఆడి రిటైర్ అయిన అబ్దుల్ రజాక్, మిల్కీ బ్యూటీ తమన్నా 2013 సమయంలో దుబాయ్‌లోని బంగారం షాప్ ఓపెనింగ్‌కి వెళ్లారు. అప్పుడు వారిద్దరు కలిసి ఫోటో దిగారు. ఆ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో తమన్నా, రజాక్‌లు పెళ్లి చేసుకోబోతున్నారని అందుకే బంగారం షాపింగ్ చేస్తున్నారని ప్రచారం చేశారు . దీనిని అప్పట్లోనే తమన్నా ఖండించింది. తాజాగా మళ్ళీ ఇవే వార్తలు పుట్టుకురావడంతో ఫైర్ అయింది.
నటుడితో ఎఫైర్ అని ఒకరోజు, క్రికెటర్‌తో పెళ్ళి అని మరో రోజు, డాక్టర్‌తో డేటింగ్ అంటూ ఇలా అందరితో రిలేషన్ అంటగడతారు. నేను ఎవరితో రిలేషన్ షిప్‌లో లేను . దయచేసి తప్పుడు వార్తలు పుట్టించొద్దు అని పేర్కొంది. లాక్‌డౌన్ గాసిప్ రాయుళ్ళు పాత ఫోటోలు తవ్వీ మరి ఇలాంటి పుకార్లు పుట్టించడం సరికాదని కొందరు నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.