వామ్మో.. ఆమెవి అంత పెద్దవా?

అమ్మాయిల అందాన్ని వర్ణించేప్పుడు.. పెదవులను దొండ పండ్లతో పోల్చుతారు. అయితే, ఈ అమ్మాయి దీన్ని కాస్త సీరియస్‌గానే తీసుకుంది. పెదవులు దొండ పండులా ఉంటే ఇంకా అందంగా ఉంటానని అనుకుందో ఏమో.. ఇలా తయారైంది. దొండ పండ్లు సైతం ఈర్ష్య పడే సైజులో తన పెదవులను మార్చేసుకుంది. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత పెద్ద పెదవులు ఈమెవేనట.
ఈ పెద్ద పెదాల సుందరి పేరు ఆండ్రియా ఇవానోవా. 22 ఏళ్ల ఈ చిన్నది బల్గేరియాలో నివసిస్తోంది. ఈమె పెదాలు మొదటి నుంచి ఈ సైజులో లేవు. దీని కోసం ఆమె ఎంతో కష్టపడింది. మహిళలంతా తమ రొమ్ము సైజులు పెంచుకోడానికి సర్జరీలు చేయించుకుంటుంటే.. ఆండ్రియా మాత్రం తన పెదవులను పెద్దగా చేయించుకోడానికి డబ్బులు నీళ్లలా ఖర్చు పెట్టింది. ఇప్పటివరకు 20 సార్లు యాసిడ్ లిప్ ఇంజక్షన్లు తీసుకుని పెదాల వాపు వచ్చినదానిలా తయారైంది.
2018 నుంచి ఈమె తన పెదాలను పెద్దవిగా చేసుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రతి ట్రీట్మెంట్‌కు ఆమె 135 పౌండ్లు (రూ.12,703) ఖర్చు పెడుతోంది. అంటే.. 20 లిప్ ఇంజక్షన్లకు ఎంత ఖర్చు పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంగా ఆమె ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘నా పెదవులు పెద్దగా ఉండటమంటే నాకెంతో ఇష్టం. ఇవి మరింత పెద్దవిగా ఉండాలని కోరుకుంటున్నా. కానీ, వైద్యులు ఇక చాలంటున్నారు. ఒక్కో ఇంజక్షన్‌కు కనీసం రెండు నెలలు వేచి చూడాలి. పెదాలకు ఇంజక్షన్ తీసుకున్న తర్వాత చాలా నొప్పిగా ఉంటుంది. రెండు మూడు రోజులు ఆహారం తినలేను’’ అని తెలిపింది.