ఏడాది చివరికల్లా టీకా!
కరోనా రక్కసికి టీకా ఈ ఏడాది చివరికల్లా సిద్ధమవుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కరోనా వైరస్ చికిత్సకు రెమిడెస్‌విర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు తమ ప్రభుత్వం కృషిచేస్తోందన్నారు. ఫాక్స్ న్యూస్ చానల్ నిర్వహించిన టౌన్‌హాల్ కార్యక్రమంలో ఆయన చానల్ సోషల్ మీడియా ద్వారా అందిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందనే అనుకుంటున్నానని చెప్పారు. ఆరోగ్య శాఖ అధికారులు టీకా తయారీకి ఏడాది నుంచి ఏడాదిన్నర సమయం పడుతుందని ప్రకటించినప్పటికీ గత నెలలో వైట్‌హౌస్ టాస్క్‌ఫోర్స్ సభ్యుడు డాక్టర్ ఆంథొనీ ఫాసీ టీకా త్వరగా అందుబాటులోకి వస్తుందని చెప్పిన సంగతి తెలిసిందే.