జేఈఈ, నీట్ పరీక్షలపై తేదీలపై 5 న ప్రకటన.


లాక్‌‌డౌన్ కారణంగా వాయిదాపడ్డ జేఈఈ, నీట్ పరీక్షల తేదీలను మే 5 న ప్రకటిస్తామని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ‘‘లాక్‌డౌన్ కారణంగా వాయిదాపడ్డ పరీక్షల తేదీలను మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మే 5 న ప్రకటిస్తారు. ఈ ప్రకటనతో విద్యార్థుల్లో ఉన్న అనిశ్చితి పోతుంది. అదే రోజు మంత్రి పోఖ్రియాల్ ఆన్‌లైన్‌లో విద్యార్థులతో ముచ్చటిస్తారు’’ అని అధికారులు పేర్కొన్నారు.