రంగారెడ్డి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో 16 రకాల కార్యకలాపాలకు అనుమతి…కలెక్టర్ అమయ్ కుమార్

రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 16 రకాల పలు పారిశ్రామిక, కార్మిక కార్యకలాపాలను సాయంత్రం 6 గంటల వరకు అనుమతిస్తున్నామని జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ప్రకటించారు.అయితే, కోవిద్ -19 మార్గదర్శక సూత్రాలను అనుసరించి సామాజిక దూరం, శానిటేషన్ తదితర జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రధానంగా స్టోన్ క్రషింగ్, ఇటుకల తయారు, చేనేత మగ్గాల నిర్వహణ, మరమ్మతుల వర్క్ షాప్ లు, బీడీ తయారీ, ఇసుక మైనింగ్, సిరామిక్ టైల్స్, రూఫ్ టైల్స్, సిమెంట్ ఫ్యాక్టరీలు.జిన్నింగ్ మిల్లులు, ఐరన్- స్టీల్ ఇండస్ట్రీలు, ప్లాస్టిక్ సానిటరీ పైపుల తయారీ, పేపర్ ఇండస్ట్రీ, కాటన్ పరుపుల తయారీ, ప్లాస్టిక్ రబ్బర్ ఇండస్ట్రీ,నిర్మాణ పనులు, దుకాణాల ద్వారా విక్రయాలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి నిచ్చిందని తగు జాగ్రత్తలు పాటిస్తూ వీటిని సాయంత్రం ఆరు గంటలవరకు నిర్వహించవచ్చని కలెక్టర్ స్పష్టంచేశారు.ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అనుమతించిన ఈ పరిశ్రమలు, కార్యకలాపాలకు సంబంధించి తగు మినహాయింపు నివ్వాలని రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమీషనర్ లను కలెక్టర్ అమయ్ కుమార్ కోరారు.