మే 5 న మంత్రివర్గ సమావేశం
కరోనా వల్ల విధించిన లాక్ డౌన్ నిర్ణయం తీసుకుందుకు మే ౫వ తేదీన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మే 7వ తేదీ వరకు ఉన్న లాక్ డౌన్ ని మరోమారు పూడిగించాలా లేదా కొన్ని సడలింపులు ఇస్తూ ఎత్తివేయాల అనే అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరగనుంది. అలాగే రైతులు నుండి పంట కొనుగోలు ఇతర సమస్యలపై కూడా చర్చ జరగనుంది. అయితే గత కొన్ని రోజుల నుండి తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే హైదరాబాద్ లో కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరింత కఠినంగా ఉండాలని ఇప్పటికే సీఎం సూచించారు. మరోవైపు కేంద్రం కూడా ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. అలాగే వివిధ రాష్ట్రాలలో చికుక్కున వారిని కూడా తమ ప్రాంతాలకు వెళ్లేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేయాలనీ ఇప్పటికే కేంద్ర హోంశాఖ సూచించింది. ఈ అంశంపై కూడా చర్చ జరగనుంది.