కోర్టులకు వేసవి సెలవులు రద్దు
తెలంగాణలో కోర్టులకు వేసవి సెలవులు రద్దు అయ్యాయి. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని న్యాయస్థానాలకు వేసవి సెలవుల్ని రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. లాక్డౌన్ వల్ల కోర్టుల్లో కార్యకలాపాలు స్తంభించడంతో ఈ నిర్ణయం తీసుకున్న హైకోర్టు, జిల్లా, ఇతర కోర్టులు, ట్రైబ్యునళ్లకు సెలవులు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న హైకోర్టు.