ఇంటికో కోడి, పది కోడిగుడ్లు

కరోనా కష్టాన్ని చుసిన ఆమె చలించిపోయంది. తనకు ఓట్లు వేసి గెలిపించవారికి ఆదుకోవాలని అనుకున్నది. ఈ సమయంలో చేద్దామన్న ఎక్కడ పని లేదు, కడుపు నిండా తిండి లేదు. ఇలాంటి సమయంలోనే వారికీ అండగా నిలిచింది సంగారెడ్డి జిల్లా గుంతపల్లి సర్పంచ్ పడమటి సుమిత్ర. గ్రామంలోని 450 కుటుంబాలకు ఉచితంగా ఒక కోడి, పది కోడిగుడ్లు పంపిణి చేసి అందరికి ఆకర్షించింది. గతంలో ఒక వారం కూరగాయలు, తరువాత పది రోజులకు సరిపడా కూరగాయలు, నిత్యావసరాలు ఉచితంగా పంపిణీ చేసిన సర్పంచ్ మాస్క్ లు, శానిలైజర్లు ఇంటింటికీ ఉచితంగా పంపిణీ చేసింది. గ్రామస్తుల ఆరోగ్యమే ముఖ్యమని, కరోనా విపత్కర పరిస్థితులలో ప్రజలకు అండగా నిలవడం బాధ్యత అని భావించి సాయం చేస్తున్నట్లు వెల్లడించింది. గ్రామస్తులు గడప దాటకుండా కరోనా కట్టడికి సహకరించాలని కోరారు. శనివారం ఇంటింటికీ కోడి, కోడిగుడ్లు పంపిణీ చేసారు సర్పంచ్ కుమారుడు అనంత్ రెడ్డి.