ఉన్నోడికి సరదా ఛాలెంజ్ …. లేనోడికి ఆకలి ఛాలెంజ్

మీరు రెండు నిముషాలు సమయం కేటాయించి తప్పక చదవండి దయచేసి.
కరోనా ఇలాంటి పరిస్థితులను తెచ్చింది అంటే…. డబ్బులునోడికి ఛాలెంజ్ ఒక సరదా అయితే .. సామాన్యుడికి, పేదోడికి, బిచ్చగాడికి ఒక పూట అన్నం దొరకడమే ఒక ఛాలెంజ్ గా మారింది. ఒక్క మాటలో చెప్పాలి అంటే .. ఉన్నోడికి తిన్నది అరగడానికి ఒక ఆటలా మారింది.

దేశమంతా లాక్ డౌన్ విధిస్తే పేదవారి కోసం కొంత మంది రోడ్ల మీద తిరుగుతూ అన్నం, ఇతర సరుకు పంచి పెట్టారు. అయితే అవి కొన్ని రోజుల పాటు ఒక యుద్ధంలా చేశారు. కరోaవితం అందరికి వరం కావొచ్చు కానీ కొందరకి శాపమే మరి. కరోనా వచ్చి చంపడం ఏంటో కానీ ఆకలి తో పేదోడు ముందే చచ్చి పోతున్నాడు. సమాజం అంతా ఇలా ఉంటే… సెలబరిటీలు మాత్రం మరోలా ఉన్నారు. నీవు దోష వేయి, కొత్త చీర కట్టుకో, ఇంట్లో చెత్త క్లిన్ చేయండి, మీ అమ్మ కి వంట చేసి పెట్టు… ఇలా పనికి రాని పనులన్నీ చేస్తునాన్రు. మరి అమ్మ లేని ఆనాధలు ఎవరు చూసుకుంటారు. మా వంతు లెంగ్ దేనా మన మానవులకు ఉన్న విలువలు. ఛాలెంజ్ మీకు సరదానే కావొచ్చు కానీ పేదోడికి అది మనిషిలోని మానవత్వాన్ని చూపిస్తుంది. రోడ్ల మీదకి వచ్చి పేదవారికి ఒక పూట అన్నం పెట్టాము అనే ఒక ఛాలెంజ్ తీసుకోండి. ఈ వార్త చదివిన ప్రతి ఒక్కరు కూడా మా డెక్కన్ న్యూస్ తరుపున ఈ ఛాలెంజ్ తీసుకోవాలని కోరుతున్నాము.