అందరు లాక్ డౌన్ లో ఉంటే వీళ్ళు ఆ పని చేశారు

దేశమంతా లాక్‌డౌన్‌ అమలులో బిజీ బిజీగా ఉన్నారు. అయితే వాళ్ళు మాత్రం ఆ పని చేసేసారు. అందుకు పోలీసుల సపోర్ట్ కూడా లభించడం అందరిని విస్మయానికి గురి చేసింది. కర్ణాటకలో లాక్ డౌన్ అమలులో పోలీసులు నిమగ్నమై ఉన్నారు అయితే అక్కడికి ఒక జంట వచ్చి మాకు పెళ్లి చేయండి అని అడిగారు. దింతో పోలీసులు ఏంటి ఈ సమయంలో మీకు పెళ్లి కావాలా అని అడిగారు. సార్ మేము చిన్నప్పటి నుండి ప్రేమించుకుంటున్నామని మాకు మీరే పెళ్లి చేయాలి అంది అడిగారు. అసలు విషయంలోకి వెళ్తే కనకపుర తాలూకా తావరగట్టె గ్రామం నివాసి పవన్‌ (23), మూలెగుంది గ్రామానికి చెందిన శృతి (23)ఇద్దరూ బాల్య స్నేహితులు. ప్రేమించుకుని పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ కులాలు వేరని పెద్దలు అంగీకరించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. లాక్‌డౌన్‌ టెన్షన్‌లోనూ పోలీసులు వారికి సాతనూరు స్టేషన్‌లోనే వివాహం జరిపించి ఆశీర్వదించారు.