సీఎంకి ఎందుకంత భయం : బండి సంజయ్

రాష్ట్రం అల్ల కల్లోలం అవుతుంటే రైతులను పట్టించుకోవడం లేదని భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ ఆరోపించారు. ఇలాంటి విపత్కర సమయంలో విపక్షాల సలహాలు, సూచనలు సీఎం తీసుకోవాలని అన్నారు. అంతే కానీ ఒటెంద్దుపోకడడతో పాలనా చేయవద్దు అన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం సంజయ్‌ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో రైతు సమస్యలు, కూలీల ఇబ్బందులను ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదన్నారు. న్యాయం చేయమని కోరిన రైతులపై కేసులు పెడుతున్నారని విమర్శించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి లాక్‌డౌన్‌ విధించడంతో కూలీలు దొరకక, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయక, ఐకేపీ సెంటర్లలో సరైన ఏర్పాట్లు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారం రోజులుగా తరఫున రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. కరోనా విపత్తుపై అఖిలపక్షం ఏర్పాటు చేయమంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. ‘రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ తెలియజేసినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. వడగండ్ల వానతో రైతాంగానికి తీరని నష్టం ఏర్పడింది. కొనుగోళ్లలో రైతులు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతిపక్షం చేసిన సూచనలు సలహాలు పట్టించుకోవడం లేదు. టోకెన్లు, డ్రా సిస్టంతో ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు చాలా కేంద్రాలలో ప్రారంభం కాలేదు. తేమ, తాలు పేరుతో ధాన్యం ను దోపిడీ చేస్తున్నారు. 30 వేల కోట్లు పెడితే మద్దతు ధర ఎందుకు చెల్లించట్లేదు.