ప్లాన్ల వ్యాలిడిటీ గడువు పెంచిన నాలుగు టెల్కోలు

రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాతోపాటు బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ వినియోగదారులకు ఊరట కల్పించాయి. లాక్‌డౌన్‌ను దృష్టిలో ఉంచుకొని వారి ప్యాక్‌ల చెల్లుబాటు గడువు (వ్యాలిడిటీ పీరియడ్‌)ను పొడిగించాయి. లాక్‌డౌన్‌ ముగిసే వరకు తమ వినియోగదారులకు ఇన్‌కమింగ్‌ కాల్స్‌ను అందజేస్తామని రిలయన్స్‌ జియో ప్రకటించింది. దీనివల్ల కేవలం అల్పాదాయ వినియోగదారులకే కాకుం డా ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్లాన్లను రీచార్జిచేసుకోలేకపోతున్న వారందరికీ లబ్ధి చేకూరుతుందని  ఓ ప్రకటనలో పేర్కొన్నది. ఇదేవిధంగా తమ నెట్‌వర్క్‌ల పరిధిలోని దాదాపు 12 కోట్ల మంది అల్పాదాయ వినియోగదారుల ప్రస్తుత ప్లాన్ల గడువును వచ్చేనెల 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ వెల్లడించాయి. మరోవైపు ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ ఎల్‌ తమ ఖాతాదారులకు మే 5 వరకు ఇన్‌కంమింగ్‌ కాల్స్‌ సౌకర్యాన్ని పొడిగిస్తున్నట్టు తెలిపింది.