గ్యాస్ సిలండర్ ఇంటి గేటు వరకే డెలివరీ

లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ గ్యాస్ డీలర్ల అసోసియేషన్స్ గ్యాస్ డెలివరీ సేవల్లో మార్పులు చేశాయి . వినియోగదారులకు ఇంతకూ ముందు సిలండర్ ఇంటి గుమ్మం వరకు అందించేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందుకోసమే గ్యాస్ సిలండర్  ను ఇంటి గేటు వరకే డెలివరీ చేయనున్నట్లు తెలంగాణ, ఏపీ గ్యాస్ డీలర్ల అసోసియేషన్స్  ప్రకటించాయి.  గ్యాస్ కంపెనీల ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు పేర్కొన్నారు.