భారత్ లో కరోనా నృత్యం
దేశంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. శనివారం సాయంత్రం నాటికి మొత్తం కేసుల సంఖ్య 14,792కు పెరిగింది. 24 గంటల వ్యవధిలో 957 కొత్త కేసులు నమోదు కాగా, 36 మంది చనిపోయారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. 12,289 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 2,015 కోలుకొని డిశ్చార్జ్ కాగా 488 మంది ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 3,323 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా ఢిల్లీ(1,707), మధ్యప్రదేశ్(1,355) కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.