కఠినంగా ఉండండి

రోజు రోజుకి కరోనా వ్యాప్తి ఎక్కువ కావడం వాళ్ళ కేంద్రం అప్రమత్తం అవుతుంది. రాష్ట్రాలలో నియంత్రణ కోసం తీసుకుంటున్న అంశాలపై మోడీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ సీఎస్‌లు పాల్గొన్నారు. కరోనా నియంత్రణ చర్యలు, కంటైన్‌మెంట్‌ జోన్లలో తీసుకోవాల్సిన చర్యలు..ఇవాళ విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల అమలుపై చర్చించారు. రాబోయే రోజులలో మరింత కఠినంగా ఉంటె తప్ప మనం కరోనని అడ్డుకోలేము అని కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబ తెలిపారు. మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలనీ సూచించారు.