మే 3 వరకూ శ్రీవారి దర్శనాల రద్దు
కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించడంతో మే 3 వరకు శ్రీవారి దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరిస్తున్నామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. టీటీడీ అనుబంధ ఆలయాలలో కూడా దర్శనాలు రద్దు చేస్తున్నామని ఆయన చెప్పారు. తిరుపతిలో ప్రతి నిత్యం లక్షా 30 వేల అన్నప్రసాద ప్యాకెట్లను ప్రజలకు పంపిణీ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు రూ. కోటి చొప్పున అన్నప్రసాద ట్రస్ట్ తరుపున నిధులు కేటాయిస్తున్నామని ఈవో స్పష్టం చేశారు.