కాన్సర్ తో బాధపడుతున్న 5 సంవత్సరాల బాలునికి చికిత్స నిమిత్తం సుగుణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విరాళం

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈరోజు భువనగిరి మండలంలోని సూరేపల్లి గ్రామంలో కాన్సర్ తో బాధపడుతున్న కాసుల వరుణ్ సాయి గౌడ్ S/o సురేష్ (5 సంవత్సరాల) బాలునికి చికిత్స నిమిత్తం సుగుణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో MPTC పాశం శివానంద్ తరపున 5000 మరియు అతను వాట్సప్ స్టేటస్ తో చేసిన విజ్ఞప్తి ద్వారా సేకరించిన 40,000 & స్థానిక రూరల్ SI రాఘవేందర్ గారు 5000 మొత్తం 50,000₹ (యాబై వేలు) విరాళం ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా DCP నారాయణరెడ్డి మరియు ACP భుజంగరావు గార్ల సమక్షంలో కూనూరు MPTC పాశం శివానంద్ వారి కుటుంబానికి అందజేయడం జరిగింది, ఈ సందర్భంగా డీసీపీ గారు మాట్లాడుతూ ఒక సామాజిక సేవా దృక్పథంతో ఆర్థిక సహాయం చేసినందుకు అభినందించారు…