టెలీమెడిసిన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

టెలీమెడిసిన్‌ విధానాన్ని పటిష్టంగా నడపాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా టెలీమెడిసిన్‌ టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి వైద్యుడితో మాట్లాడారు. టెలీమెడిసిన్‌ వైద్య సేవలను నిత్యం పర్యవేక్షించాలని, అవసరమైతే వైద్యుల సంఖ్యను పెంచాలన్నారు .ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 వరకు టెలీమెడిసిన్‌లో ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయి. ఓపీ సేవలు, ఔషధాల కోసం టెలిఫోన్‌ ద్వారా వైద్యులు సూచనలు, సలహాలు ఇస్తారని తెలిపినారు. కరోనా వైరస్ గురించి అప్రమతంగా ఉండాలని మంత్రి సూచించారు.