మందు బాబులకు సూపర్ న్యూస్ తెరుచుకోనున్న వైన్ షాప్ లు

గత కొన్ని రోజులుగా ఉక్కిరి బిక్కిరి అవుతున్న మందు బాబులకు రాష్ట్ర ముఖ్యమంత్రి శుభా వార్త చెప్పారు. రోజుకి ఏడు గంటల పాటు షాప్ లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కానీ ఎక్కడ ఒక ట్విస్ట్ మీకు. ఆ షాప్ లు తెరుచుకొనేది తెలంగాణాలో కాదు అస్సాంలో.
లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ అస్సాం రాష్ట్రంలో సోమవారం నుంచి మద్యం దుకాణాలు తెరుచుకోనున్నాయి. అలాగే బాట్లింగ్‌ ప్లాంట్లు, డిస్టిలరీలు, బ్రూవరీలు కూడా పని చేస్తాయి. మద్యం దుకాణాలను రోజుకు 7 గంటలు మాత్రమే తెరిచి ఉంచాలని అస్సాం ఎక్సైజ్‌శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆరోగ్యశాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను అందరూ తప్పనిసరిగా పాటించాలని తేల్చిచెప్పింది. అస్సాంలో ఇకపై ప్రభుత్వం అనుమతించిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లిక్కర్‌ షాపులు తెరిచి ఉంటాయి.