పీఎం-కేర్స్‌ నిధి విరాళాలను ఫారం 16లో చూపాలి

ఉద్యోగులు తమ వేతనాల నుంచి పీఎం-కేర్స్‌ నిధికి అందించిన విరాళాలను యజమానులు ఫారం 16లో చేర్చాలని ఆదాయ పన్ను శాఖ ఆదేశించింది. ఈ నిధికి అందించే విరాళాలకు ఐటీ చట్టంలోని 80జీ కింద నూరు శాతం పన్ను మినహాయింపు వర్తిస్తుంది. చాలా మంది ఉద్యోగులు తమ వేతనాల్లో కొంత మొత్తాన్ని (ఒక రోజు లేదా వారం లేదా నెల రోజుల వేతనం) పీఎం కేర్స్‌ నిధికి విరాళంగా అందిస్తున్నట్టు నంగియా ఆండర్సన్‌ కన్సల్టింగ్‌ డైరెక్టర్‌ శైలేష్‌ కుమార్‌ చెప్పారు. అలా అందించిన విరాళాలను వారికి ఏడాది చివరిలో ఇచ్చే ఫారం 16లో 80జీ సెక్షన్‌ కింద మినహాయింపులో చూపవచ్చని అన్నారు.