మార్చి నెల పూర్తి వేతనం
వైద్య , పోలీసు సిబ్బందికి కేసీఆర్ శుభవార్త
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న వైద్య , పోలీసు సిబ్బందిని వేతనాల కోత నుంచి మినహాయిస్తున్నట్లు సీఎం KCR తెలిపారు . వీరికి మార్చి నెల పూర్తి వేతనం చెల్లించాలని నిర్ణయించారు . అంతేకాకుండా ఈ రెండు శాఖల ఉద్యోగులకు అదనపు నగదు ప్రోత్సాహం ( ఇన్సెంటివ్ ) కూడా ఇవ్వాలని నిర్ణయించారు . ఇన్సెంటివ్ ను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది .