నిత్యావసర వస్తువుల తో కూడిన ప్యాక్ ల పంపిణీ
ఉపాధికోసం వివిద రాష్ట్రాలు, రాష్ట్రంలో ని పలు ప్రాంతాల నుండి హైదరాబాద్ కు వచ్చిన నిరుపేదలకు పంపిణీ చేసేందుకు మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తన సొంత నిధులతో సమకూర్చిన 20 రోజులకు సరిపడ 650 నిత్యావసర వస్తువుల ప్యాక్ లను బన్సీలాల్ పేట లోని మల్టీ ఫర్పస్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఉదయం 11.00 గంటలకు కలెక్టర్ శ్రీ శ్వేతా మహంతి, ghmc కమిషనర్ శ్రీ లోకేష్ కుమార్, పోలీసు కమిషనర్ శ్రీ అంజనీ కుమార్ లకు మంత్రి శ్రీనివాస్ యాదవ్ అందజేస్తారు.
వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు ఉపాధి కోసం వలస వచ్చిన పేదలు లాక్ డౌన్ నేపధ్యంలో వారిని ఆదుకునేందుకు 20 రోజులకు సరిపడా 10 కిలోల బియ్యం, పప్పులు, నూనె ఉప్పు, కారం తదితర నిత్యావసర వస్తువుల తో కూడిన ప్యాక్ లను పంపిణీ చేయడం జరుగుతుంది.