తెదేపా సభలో అపశ్రుతి.. ఐదుగురికిపైగా మృతి

నెల్లూరు జిల్లా కందుకూరు తెదేపా సభలో అపశ్రుతి చోటు చేసుకుంది.

సభకు కార్యకర్తలు భారీగా తరలిరావడంతో తోపులాట జరిగి కొందరు కార్యకర్తలు డ్రైనేజీలో పడిపోయారు.

దీంతో అప్రమత్తమైన తెదేపా నేతలు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనలో ఐదుగురికిపైగా మృతి చెందారు.

అనంతరం చంద్రబాబు ప్రసంగం ఆపేసి.. ఆసుపత్రి వెళ్లి బాధితులను పరామర్శించారు.

కందుకూరులో ఇలాంటి దుర్ఘటన జరగడం మనసు కలచివేసిందన్నారు.

మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున 10లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు.