3 పరిమిత ఎడిషన్ శ్రేణులతో మళ్లీ వచ్చిన బాడీ షాప్ ఐకానిక్ క్రిస్మస్ కలెక్షన్
పాషన్‌ఫ్రూట్, వైల్డ్ పైన్, స్పైస్డ్ ఆరెంజ్
హ్యాండ్ బామ్‌లు, షవర్ జెల్, బాడీ బటర్, బాడీ యోగర్ట్, బాడీ స్క్రబ్, బాడీ లోషన్-టు-ఆయిల్‌తో కూడిన లిమిటెడ్ ఎడిషన్ శ్రేణులతో, ది బాడీ షాప్ క్రిస్మస్ కలెక్షన్ వినియోగదారులకు
శీతాకాలపు ఆనందాన్ని అందిస్తుంది!
ఇది సంవత్సరంలో గాలిలో చల్లదనం నిండి ఉండే సమయం. ఎన్నో లేయర్స్ తో వెచ్చగా, హాయిగా ఉండటానికి ఇది సరైన కాలం. పండుగ ఉత్సాహం కూడా మొదలవుతుంది. బ్రిటన్ కు చెందిన అంతర్జాతీ య వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్ అయిన ది బాడీ షాప్ కొన్ని ఐకానిక్, పరిమిత ఎడిషన్ ఉత్పత్తులను పరిచయం చేయడంలో ప్రసిద్ధి చెందింది. వీటిలో కొన్ని పండుగ-ప్రేరేపిత సువాసనలను కలిగి ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా బాడీ షాప్ తన సంప్రదాయాన్ని కొనసాగించింది. ఈ సంవత్సరం క్రిస్మస్ కోసం, ది బాడీ షాప్ అద్భుతమైన గిఫ్ట్ సెట్‌లను విడుదల చేస్తోంది – హ్యాండ్ క్రీమ్ నుండి షవర్ జెల్ వరకు, ఫేస్ మాస్క్ ల నుండి లిప్ బామ్ వరకు, 3 పరిమిత-ఎడిషన్ శ్రేణులలో వైల్డ్ పైన్, పాషన్‌ఫ్రూట్, స్పైస్డ్ ఆరెంజ్. కాబట్టి, మీరు స్టాకింగ్ ఫిల్లర్లు, బహుమతులు, సీక్రెట్ శాంటా బహుమతులు లేదా మీ కోసం సీజనల్ ట్రీట్ కోసం వెతుకుతున్నా, మీరు కచ్చితంగా మీకు కావాల్సింది ఏదైనా ప్రత్యేకంగా వీటిలో పొందగలుగుతారు.
ఈ సంవత్సరం ప్రత్యేక పండుగ సువాసనలు ఆరెంజ్‌లు, స్టాకింగ్స్, స్పైస్డ్ ఆరెంజ్, పైన్, డివైన్ వైల్డ్ పైన్. ఇవి మాయిశ్చరైజింగ్ లక్షణాలతో, జ్యూసీ ఆరెంజ్ సువాసనలు, పుదీనా, గంధపు చెక్కలతో సుసంపన్నమై ఉంటాయి. హ్యాండ్ బామ్స్, షవర్ జెల్స్, బాడీ బటర్, బాడీ యోగర్ట్, బాడీ స్క్రబ్, బాడీ లోషన్-టు-ఆయిల్స్ వంటి ఎన్నో ఉత్పత్తులను ఈ 3 కొత్త శ్రేణులు కలిగి ఉన్నాయి. పరిమిత-ఎడిషన్ ఉత్పత్తులతో పాటు, ది బాడీ షాప్ క్రిస్మస్ సేకరణలో మీకు అంతిమ స్వీయ-సంరక్షణ అనుభవాన్ని అందించడానికి రూపొందించ బడిన అవోకాడో, షియా, ఎడెల్‌వీస్ శ్రేణులు కూడా ఉన్నాయి. ప్రతి శ్రేణిలోనూ మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు క్రిస్మస్ ఉల్లాసాన్ని కలిగించడానికి పండుగ బహుమతి కోసం సరిపోయే కాంబోలు, గిఫ్ట్ సెట్ లు కూడా ఉన్నాయి.
ఈ ఉత్పత్తులు సువాసనతో కూడిన, ఆహ్లాదకరమైన చర్మం, జుట్టు సంరక్షణతో తమకు తాము విలాసంగా ఉండడంలో కొనుగోలుదారులకు సంతోషాన్ని కలిగించడం మాత్రమే గాకుండా వాటిని రూపొందించడంలో సహాయపడిన వారికి కూడా ఆనందాన్ని అందిస్తాయి. కమ్యూనిటీ ఫెయిర్ ట్రేడ్ ప్రోగ్రామ్ ద్వారా సమా జానికి తిరిగి ఇవ్వాలనే దాని నిబద్ధతను నొక్కి చెబుతూ, ది బాడీ షాప్ బిస్పోక్ ఇన్షియేటివ్ చిన్న ఉత్పత్తి దారులు మార్కెట్ యాక్సెస్‌ను పొందేందుకు, సామాజికంగా, పర్యావరణపరంగా ప్రయోజనకరమైన ప్రాజెక్ట్ లలో పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుంది. కాబట్టి, కొనుగోలు చేసిన ప్రతిసారీ, మీరు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిటీలకు మద్దతు ఇస్తారు. అన్ని బడ్జెట్‌లలోనూ లభించే బహుమతి సెట్‌లతో, వీటిని కొనేందుకు నిజంగా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన అవసరం లేదు.
కొత్త కలెక్షన్ పై సంక్షిప్త సమాచారం:
వైల్డ్ పైన్ లిమిటెడ్ ఎడిషన్: తాజా-సువాసన గల క్రిస్మస్ బహుమతి
రిఫ్రెష్ వాసనను ఎవరు కోరుకోరు? బాడీ షాప్ వైల్డ్ పైన్ శ్రేణి ఒక అద్భుత శాకాహార క్రిస్మస్ బహుమతి. ఇది మీ చర్మాన్ని పునరుజ్జీవింపజేసేలా ఉత్తేజపరిచే సువాసనను కలిగి ఉంటుంది. ఉత్పాదన శ్రేణిలో షవర్ జెల్, హ్యాండ్ బామ్, బాడీ లోషన్-టు-ఆయిల్, బాడీ బటర్, యూ డి టాయిలెట్ ఉన్నాయి. ఈ శ్రేణిలో పైన్ & డివైన్ ఎసెన్షియల్స్ గిఫ్ట్ కూడా ఉంది, ఇందులో హ్యాండ్ బామ్, షవర్ జెల్ , బాడీ లోషన్-టు-ఆయిల్ ఉంటాయి. షవర్ జెల్, బాడీ బటర్‌ను కలిగి ఉన్న పైన్ & డివైన్ మినీ గిఫ్ట్ కూడా లభిస్తుంది.
స్పైస్డ్ ఆరెంజ్ లిమిటెడ్ ఎడిషన్ రేంజ్: హాయిగా ఉండే స్వరూపం
మనం శీతాకాలం, క్రిస్మస్ గురించి ఆలోచించినప్పుడు, మనం హాయిగా ఉండడాన్ని గురించి ఆలోచిస్తాం. దీని పరిపూర్ణ స్వరూపం బాడీ షాప్ పరిమిత-ఎడిషన్ స్పైస్డ్ ఆరెంజ్ శ్రేణి. జ్యూసీ ఆరెంజ్, వెచ్చని వెనిల్లా, దాల్చినచెక్క సౌకర్యవంతమైన సువాసనతో, ఈ శ్రేణిలోని ఉత్పత్తులు 97% సహజ పదార్థాలతో తయారు చేయబడ్డాయి. ఇది బాక్స్ లో నిజంగా సౌకర్యంగా ఉంటుంది. ఈ శ్రేణిలోని చాలా ఉత్పత్తులు శాకాహార ఉత్పాదనలు, అన్నీ కూడా ప్యాకేజింగ్ 100% పునర్వినియోగపరచదగినవి. ప్రత్యేక ఎడిషన్‌లో షవర్ జెల్, హ్యాండ్ బామ్, బాడీ బటర్, బాడీ స్క్రబ్, బాడీ యోగర్ట్ ఉన్నాయి. 2 గిఫ్ట్ సెట్‌లు కూడా ఉన్నాయి – ఆరెంజ్‌లు & స్టాకింగ్స్ స్పైస్డ్ ఆరెంజ్ మినీ గిఫ్ట్ లో షవర్ జెల్, బాడీ బటర్ ఉంటాయి. ఆరెంజ్స్ & స్టాకింగ్స్ స్పైస్డ్ ఆరెంజ్ ఎసెన్షియల్స్ గిఫ్ట్ లో షవర్ జెల్, హ్యాండ్ బామ్, బాడీ యోగర్ట్ ఉంటాయి.
పాషన్‌ఫ్రూట్: ఫ్రూటీ ట్రీట్
ఆశ్చర్యకరమైన షార్ప్ నెస్, కూలింగ్ హిట్‌తో కూడిన పండ్ల సువాసనతో, ది బాడీ షాప్ ప్రత్యేక ఎడిషన్ ప్యాషన్ ఫ్రూట్ శ్రేణి ఒక నమ్మశక్యం కాని సువాసన సంతృప్తిని ఇస్తుంది. శ్రేణిలోని ప్రతి ఉత్పత్తి జ్యూసీగా, ఆహ్లాదకర అనుభూతిని అందించేదిగా ఉంటుంది. చర్మంపై అద్భుతమైన పోషణను అందిస్తుంది, మృదు వుగా ఉంటుంది. ఈ శ్రేణిలో బాడీ మిస్ట్, బాడీ బటర్, బాడీ యోగర్ట్, బాడీ స్క్రబ్, షవర్ జెల్ ఉన్నాయి, ఇవి కచ్చితంగా మిమ్మల్నిఆహ్లాదపరుస్తాయి, మీ చర్మాన్ని పునరుజ్జీవింపజేస్తాయి.
క్రిస్మస్ ఒక సంతోషకరమైన సందర్భం అయినప్పటికీ, భూగ్రహానికి ఒక సవాలుగా కూడా ఉంటుంది. అదనపు ప్యాకేజింగ్, పెరిగిన ప్లాస్టిక్ వినియోగం కొత్త సమస్యలు తీసుకువస్తాయి. సుస్థిరదాయక విధా నాలను అనుసరించడం ద్వారా భూమిని రక్షించడానికి అంకితమైన బ్రాండ్‌గా, ది బాడీ షాప్ ఉత్పత్తుల ప్యాకేజింగ్ అంతా బయోడిగ్రేడబుల్ లేదా రీసైకిల్ చేయడానికి వీలైందిగా ఉంటుంది. బ్రాండ్ 1989 నుండి గెట్ పేపర్ పరిశ్రమతో భాగస్వామ్యం కలిగి ఉంది. సొగసైన గిఫ్ట్ బాక్స్ లు, బ్యాగ్‌లు అని మాత్రమే కాకుండా 100% జూట్‌తో చేసిన అందమైన, స్టైలిష్ గిఫ్ట్ పౌచ్‌లను మీకు అందించడానికి టెడ్డీ ఎక్స్ పోర్ట్స్ తో భాగస్వామ్యం కలిగి ఉంది. అంతేకాకుండా, క్రూరత్వం లేని ఉత్పత్తులకు మారుపేరుగా బ్రాండ్ నిలుస్తుంది. ఇది వేగన్ లేబుల్‌ను కూడా కలిగి ఉంటుంది.
ఈ క్రిస్మస్, ప్రతి చర్మపు రకానికి, బడ్జెట్‌కు తగిన విధంగా ఏదో ఒక వస్తువు ఉన్నందున మీకు మీరుగా బహు మతి ఇచ్చుకోండి. మీ ప్రియమైన వారికి ది బాడీ షాప్ ఉత్తేజకరమైన కొత్త శ్రేణితో ఆనందాన్ని అందించండి! ఉత్పత్తుల పూర్తి జాబితాను ఇక్కడ చూడవచ్చు/కొనుగోలు చేయవచ్చు.